America: కరోనా వైరస్‌ను సూర్యరశ్మి బలహీన పరుస్తుంది: అమెరికా తాజా పరిశోధనలో వెల్లడి

  • అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో ఆరు గంటలపాటు జీవంతో ఉన్న వైరస్
  • సూర్యరశ్మి తాకిన రెండు నిమిషాల్లోనే నిర్జీవం
  • వెల్లడించిన పరిశోధకులు
Summer like conditions can curb COVID19

కరోనా వైరస్ మనుగడపై అమెరికా పరిశోధకులు నిర్వహించిన తాజా పరిశోధనలో మరో కొత్త విషయం బయటపడింది. సూర్యరశ్మి, వేడి, అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో వైరస్ త్వరగా బలహీనపడుతుందని పరిశోధకులు గుర్తించారు.

సూర్యకాంతికి వైరస్ వేగంగా నిర్జీవం అవుతుందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన విలియం బ్రయాన్ వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. లాలాజలం నుంచి వచ్చే తుంపర్లలోని కరోనా వైరస్ ఇంటిలోపలి ప్రదేశాలలోనూ, పొడి వాతావరణ పరిస్థితులలోను బాగా జీవించగలుగుతుందని తేలిందని ఆయన చెప్పారు.  

వెచ్చని వాతావరణంలో అంటువ్యాధులు ప్రబలే శాతం తక్కువగా ఉంటుందన్నారు. అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో వైరస్ ఆరు గంటలు మనగలిగిందని, అధిక తేమతోపాటు సూర్యరశ్మి కూడా సోకినప్పుడు రెండు నిమిషాల్లోనే దాని కథ ముగిసిందన్నారు. సూర్య రశ్మి కారణంగా వైరస్ 90 సెకన్లలోనే సగం బలాన్ని కోల్పోయినట్టు గుర్తించామని బ్రయాన్ వివరించారు.

More Telugu News