Venkaiah Naidu: గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారుల అంశంపై ఉపరాష్ట్రపతి స్పందన

Vice president Venkaiah Naidu statement
  • గుజరాత్ లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు
  • అమిత్ షా, గుజరాత్ గవర్నర్, సీఎంలతో మాట్లాడిన వెంకయ్య నాయుడు
  • మత్స్యకారులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామన్న విజయ్ రూపానీ
లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీలోని ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు గుజరాత్ లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ విషయమై సీఎం జగన్ ఇప్పటికే గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో మాట్లాడారు. తాజాగా, ఇదే విషయమై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ గవర్నర్ దేవవ్రత్, సీఎం విజయ్ రూపానీతో మాట్లాడారు. వీరావల్ లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామని వెంకయ్యనాయుడుకి విజయ్ రూపానీ చెప్పారు. మత్స్యకారులను రోడ్డు మార్గంలో కాకుండా సముద్ర మార్గంలోనే ఏపీకి పంపాల్సి రావొచ్చని అన్నారు. ఈ విషయమై అమిత్ షా కూడా తనతో మాట్లాడారని వెంకయ్యనాయుడుకి విజయ్ రూపానీ వివరించారు.
Venkaiah Naidu
vicepresident
Fishermen
Gujarath
cm
Amit Shah

More Telugu News