AirCooler: మహాభారత్ సీరియల్ లో భీష్ముడి వెనుక ఎయిర్ కూలర్... ఇట్టే పట్టేసిన వీక్షకులు!

  • అప్పట్లో హిట్ సీరియల్ గా పేరుతెచ్చుకున్న మహాభారత్
  • లాక్ డౌన్ నేపథ్యంలో పునఃప్రసారం
  • నెట్టింట జోకులు పేలుతున్న వైనం
Air cooler behind Bheeshma as Mahabharat serial was targeted satirical

కొన్ని దశాబ్దాల కిందట దూరదర్శన్ చానల్లో వచ్చిన మహాభారత్ సీరియల్ ఎంతో ప్రజాదరణ పొందింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఆ సుదీర్ఘమైన సీరియల్ ను దూరదర్శన్ పునఃప్రసారం చేస్తోంది. అయితే, అప్పట్లో ఆ సీరియల్ లో ఎవరూ గుర్తించని తప్పులను నేటి తరం ప్రేక్షకులు ఈజీగా కనిపెట్టేశారు.

ఓ ఎపిసోడ్ లో భీష్ముడి పక్కన ఎయిర్ కూలర్ కనిపించగా, ప్రేక్షకుల ఇట్టే పట్టేశారు. సోషల్ మీడియాలో దీనిపై జోకులు పేలుతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు ఇంగ్లీషు టెలివిజన్ సీరిస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎపిసోడ్ లో జరిగిన తప్పిదాన్ని కూడా ప్రస్తావించారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కాఫీ కప్ కనిపించడం ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. ఈ రెండింటిని కలిపి నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు గుప్పిస్తున్నారు.

More Telugu News