Mumbai: లక్షన్నర ఫ్లెమింగోలతో గులాబీ వర్ణంలోకి మారిన నవీ ముంబై ప్రాంతం!

  • లాక్ డౌన్ లో స్వేచ్ఛగా విహరిస్తున్న జంతువులు, పక్షులు
  • నవీ ముంబైకి భారీగా వలస వచ్చిన ఫ్లెమింగోలు
  • గత ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరిగిన వలస
Thousands Of Flamingos Turn Creek Near Mumbai Pink

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో జంతువులు, పక్షులు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. వన్యమృగాలు సైతం రోడ్లపైకి వస్తున్నాయి. విదేశాల నుంచి వలస వచ్చే పక్షుల సంఖ్య కూడా పెరిగింది. ఇలాగే సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వేలాది ఫ్లెమింగో పక్షులతో ముంబై శివారు నవీ ముంబై ప్రాంతంలోని సముద్రపు పాయ గులాబీ వర్ణాన్ని సంతరించుకుంది. వీటికి సంబంధించిన ఫొటోలను పలువురు రాజకీయ నేతలు, బాలీవుడ్ సెలబ్రిటీలు షేర్ చేస్తున్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వలస వచ్చిన ఫ్లెమింగో పక్షుల సంఖ్య 25 శాతం పెరిగిందని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ తెలిపింది. గత ఏడాది 1.2 లక్షల పక్షులు వచ్చాయని... ఈ ఏడాది వాటి సంఖ్య 1.5 లక్షలకు పెరిగిందని వెల్లడించింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత సరైన సంఖ్యను లెక్కించి వెల్లడిస్తామని తెలిపింది. ఈ ఫ్లెమింగోలు గుజరాత్ లోని రానాఫ్ కచ్, రాజస్థాన్ లోని సాంబార్ సరస్సు నుంచి వచ్చాయి. మరికొన్ని పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల నుంచి వలస వచ్చాయి.

More Telugu News