నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ నెల 25న అందుబాటులోకి వస్తున్న 'భీష్మ'

23-04-2020 Thu 16:18
  • నితిన్ - రష్మిక జంటగా వచ్చిన 'భీష్మ'
  • ఇద్దరి కెరియర్లోను చెప్పుకోదగిన హిట్
  • కాసుల వర్షం ఖాయమంటూ టాక్
Bheeshma Movie

నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన 'భీష్మ' విజయాన్ని అందుకుంది. రష్మిక  కథానాయికగా అలరించిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఈ ఇద్దరి కెరియర్లోను ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. కథాకథనాలు .. సంగీతం ఈ సినిమాను నిలబెట్టేశాయి.

థియేటర్స్ లో ఈ సినిమా జోరుగా సాగుతున్న సమయంలోనే కరోనా ఎఫెక్ట్ చూపడం మొదలైంది. ఈ కారణంగానే చాలామంది ఈ సినిమాను థియేటర్స్ లో చూడలేకపోయారు. అలాంటివారిని నెట్ ఫ్లిక్స్ ద్వారా 'భీష్మ' పలకరించనుంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే వుండిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ కూడా ఈ సినిమా హిట్ అవుతుందనే చెప్పచ్చు!