Arogyasetu App: ఫేస్ బుక్ ను వెనక్కునెట్టి.. ప్రపంచ రికార్డ్ సాధించిన ఇండియన్ యాప్

  • 13 రోజుల్లో 5 కోట్ల యూజర్లను సొంతం చేసుకున్న ఆరోగ్యసేతు
  • ఫేస్ బుక్ యాప్ కు 19 రోజుల సమయం పట్టిన వైనం
  • ప్రతిఒక్కరూ ఆరోగ్యసేతును డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చిన మోదీ
Arogyasetu App beats Facebook record

ఏ యాప్ అయినా పాప్యులర్ కావాలంటే ఇండియాలో గుర్తింపు పొందాలి. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో పాప్యులర్ అయితేనే ఏ యాప్ అయినా టాప్ లెవెల్ కు వెళ్తుంది. ఫేస్ బుక్, వాట్సాప్ తదితర యాప్ లన్నీ ఇండియాలో పాప్యులర్ అయినవే. అయితే, ఈ యాప్ లు అన్నింటినీ భారతీయ యాప్ 'ఆరోగ్యసేతు' అధిగమించింది.

ఫేస్ బుక్ యాప్ కు 5 కోట్ల మంది యూజర్లు యాడ్ కావడానికి 19 రోజుల సమయం పట్టింది. అలాంటిది కేవలం 13 రోజుల్లోనే ఆరోగ్యసేతు యాప్ 5 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. తద్వారా అతి తక్కువ రోజుల్లో 5 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకున్న యాప్ గా ప్రపంచ రికార్డును సృష్టించింది.

ఈ నెల 14వ తేదీన ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రస్తంగిస్తూ... ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో యాప్ లో ఇచ్చే సూచనల మేరకు అందరూ నడుచుకోవాలని చెప్పారు. దీంతో, అతి తక్కువ సమయంలోనే 5 కోట్ల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

More Telugu News