Nimmakayala Chinarajappa: వైసీపీ నాయకులు లాక్ డౌన్ నిబంధనలు పాటించట్లేదు: టీడీపీ నేత చినరాజప్ప

TDP Leader chinna Rajappa criticises YSRCP
  • ఏపీలో ‘కరోనా’ విజృంభిస్తోంది
  • అయినా ప్రభుత్వం సరిగ్గా స్పందించట్లేదు
  • రాష్ట్రంలో ‘కరోనా’ కేసులు మరింతగా పెరిగే పరిస్థితి ఉంది

ఏపీలో ‘కరోనా’ విజృంభిస్తున్నా ప్రభుత్వం తగిన రీతిలో స్పందించట్లేదని, వైసీపీ నాయకులు లాక్ డౌన్ నిబంధనలు పాటించట్లేదని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. రాష్ట్రంలో ‘కరోనా’ కేసులు మరింతగా పెరిగే పరిస్థితి కన్పిస్తోందని అన్నారు. ‘కరోనా’ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం వెంటనే బయటపెట్టట్లేదని విమర్శించారు. వైద్య, పోలీస్, రెవెన్యూ, పారిశుద్ధ్య సిబ్బందికి సరిపడా కిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News