Chennai Zoo: లాక్ డౌన్ సమయంలో... చెన్నై జూపార్కులోని జంతువుల్ని చూసేందుకు మార్గం ఇదిగో!

  • లాక్ డౌన్ తో మూతపడిన జూ పార్కులు
  • 14 రకాల జంతువుల్ని వీక్షించేందుకు చెన్నై జూ వీడియో స్ట్రీమ్
  • వెబ్ సైట్లో కానీ, యాప్ ద్వారా కానీ వీక్షించే అవకాశం
Chennai Zoo established live stream to wacth animals

కరోనా భూతాన్ని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించడంతో అన్నింటితోపాటు జంతుప్రదర్శన శాలలు కూడా మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్న జూ పార్కుల్లో సందర్శకులను అనుమతించడంలేదు. అయితే జంతు ప్రేమికులు జూ పార్కులో ఉన్న జంతువులు ఇప్పుడు ఏంచేస్తుంటాయో వీక్షించాలనుకుంటే చెన్నై జూ వెబ్ సైట్ ను కానీ, జూ యాప్ ను కానీ సందర్శిస్తే సరి. రెండేళ్ల కిందటే చెన్నై జంతుప్రదర్శనశాల అధికారులు వినూత్నంగా ఆలోచించి వీడియో స్ట్రీమింగ్ అందుబాటులోకి తెచ్చారు.

 వండలూర్ జూ పార్క్ గా ప్రసిద్ధి చెందిన ఇక్కడి అరైగ్నర్ అన్నా జూలాజికల్ పార్క్ లో జంతువులు ఏం చేస్తుంటాయో వన్యప్రాణి ప్రేమికులు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు చెన్నై జూకి సంబంధించిన వెబ్ సైట్ లో 4.5 కోట్ల పేజ్ వ్యూస్, 50 వేల యాప్ డౌన్ లోడ్లు నమోదయ్యాయి. భారత్ లో జంతువులను లైవ్ స్ట్రీమింగ్ లో చూపించే జూ ఇదొక్కటే. ఈ జూకి చెందిన ఫేస్ బుక్ పేజీలో రోజుకొక జంతువును లైవ్ లో చూపిస్తుంటారు. పెద్దపులి, సింహం తదితర 14 రకాల జంతువులను ఈ స్ట్రీమింగ్ ద్వారా చూడొచ్చని జూ అధికారులు వెల్లడించారు.

More Telugu News