Sachin Tendulka: ఈసారి తన జన్మదిన వేడుకలకు సచిన్ దూరం!

Sachin Tendulkar decides against celebrating 47th birthday  Heres why
  • శుక్రవారం సచిన్ 47వ పుట్టిన రోజు
  • కరోనా సంక్షోభంలో సంబరాలు జరుపుకోవద్దని నిర్ణయం
  • తద్వారా వైద్య సిబ్బంది, పోలీసులకు గౌరవం
రేపు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 47వ జన్మదినం!
సచిన్ పుట్టిన రోజు అంటే అతని అభిమానులకు పండగే. అయితే, కరోనా వైరస్ విజృంభణతో ప్రస్తుతం దేశం మొత్తం కష్టకాలంలో ఉన్న వేళ సంబరాలకు ఇది సమయం కాదని సచిన్ అంటున్నాడు. కరోనా వైరస్‌ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారి గౌరవార్థం ఈ సారి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోకూడదని సచిన్ నిర్ణయం తీసుకున్నాడు.

‘ఈ సారి తన జన్మదిన వేడుక జరుపుకోకూడదని సచిన్ నిర్ణయించాడు. కరోనా వైరస్‌పై ముందుండి పోరాడుతున్న  వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులు, డిఫెన్స్ అధికారులకు తాను ఇచ్చే గొప్ప గౌరవం ఇదే అని భావిస్తున్నాడు’ అని సచిన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.  ప్రధాన మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధులకు సచిన్ ఇది వరకే రూ. 50 లక్షల విరాళం ప్రకటించాడు. అలాగే, సోషల్‌ మీడియా వేదికగా ఈ  వైరస్‌పై అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.
Sachin Tendulka
not
celebrating
his birthday

More Telugu News