5G: 5జీ కారణంగా కొవిడ్-19 వ్యాపిస్తుందా?... స్పష్టత నిచ్చిన ఐక్యరాజ్యసమితి

  • 5జీతో కరోనా వస్తుందని పుకార్లు
  • బ్రిటన్ లో సెల్ టవర్ల ధ్వంసం
  • 5జీతో వైరస్ వ్యాప్తికి ఆధారాల్లేవన్న ఐరాస
UN agency said no corona infection with 5G technology

మొబైల్ ప్రపంచంలో 5జీ సాంకేతికత ఓ విప్లవం లాంటిది. అయితే, ఈ 5జీ టెక్నాలజీ కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతోందంటూ ఇటీవల భారీగా ప్రచారం మొదలైంది. 5జీ సాంకేతిక పరిజ్ఞానం వాడకం, దీనికి సంబంధించిన తరంగాలతో మానవ వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతుందన్నది ఓ వాదన. ఈ అపోహలతోనే బ్రిటన్ లో సెల్ ఫోన్ టవర్లను ధ్వంసం చేయడం వీడియోల రూపంలో వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞాన విభాగం స్పందించింది.

కొవిడ్-19 వైరస్ వ్యాప్తికి, 5జీ హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీకి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తికి 5జీకి సంబంధం ఉందన్న వాదనలను గాలివార్తలుగా కొట్టిపారేసింది. అందుకు సాంకేతికపరమైన ఆధారాలు లేవని పేర్కొంది. దీనిపై అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్స్ సంఘం (ఐటీయూ) అధికార ప్రతినిధి మోనికా గెహ్నర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ రేడియో తరంగాల ద్వారా వ్యాపించదని, ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన నెలకొన్న వాస్తవ పరిస్థితుల్లో ఇలాంటి ప్రచారం నిజంగా సిగ్గుచేటు అని అన్నారు.

More Telugu News