'ఫైటర్' విషయంలో ఆలోచనలో పడిన పూరి?

23-04-2020 Thu 14:39
  • 'ధారావి' నేపథ్యంలో సాగే కథ
  • అక్కడ లాక్ డౌన్ పొడిగించే అవకాశం
  • ఆ తరువాత అనుమతులు కష్టమేనంటూ టాక్
Puri Jagannath in dilemma about Fighter Movie
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'ఫైటర్' రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబైలోని 'ధారావి' స్లమ్ ఏరియా నేపథ్యంలోనే ఈ కథ నడుస్తుంది. ఇక్కడే విజయ్ దేవరకొండపై చాలా సన్నివేశాలను ప్లాన్ చేశారట. కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు కూడా. ఆ తరువాత లాక్ డౌన్ కారణంగా షూటింగు ఆగిపోయింది.

ఇటీవల 'ధారావి' ప్రాంతం నుంచి కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతూ వున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తరువాత కూడా అక్కడ షూటింగ్ జరపడానికి అంత తేలికగా అనుమతులు లభించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథా నేపథ్యంతో ముడిపడిన ప్రాంతంలోనే షూటింగు జరుపుకునే అవకాశం లేకుండా పోవడంతో, పూరి ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు.