nagababu: పలువురు నేతల ఫొటోలు పోస్ట్ చేసి.. మాస్కులపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

naga babu on corona virus masks
  • మాస్క్ వాడుతున్న మోదీ, పలువురు ముఖ్య మంత్రులు 
  • కొందరు నేతలు మాత్రం వాడట్లేదు
  • కొందరి వద్ద మాస్కులు ఉన్నప్పటికీ వాడట్లేదు
  • ప్రజల మధ్య మాస్కులు వాడడం మన ధర్మం
మాస్క్ వాడుతున్న ప్రధాన మంత్రి మోదీ, ముఖ్య మంత్రులు కేసీఆర్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరేల ఫొటోలు పోస్ట్ చేసి జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మాస్కులు వాడని మరికొందరు నేతల ఫొటోలను కూడా పోస్ట్ చేసి వారిపై విమర్శలు గుప్పించారు.
                                                 
మీడియా సమావేశంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాస్కు వాడట్లేదని, అలాగే, ఆంధ్రప్రదేశ్‌ మంత్రి ఆళ్ల నాని కూడా ఇదే తీరును ప్రదర్శిస్తున్నారని నాగబాబు వారి ఫొటోలను పోస్ట్ చేశారు.
                                                                      
తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మాత్రం మాస్కులు వాడుతున్నారని నాగబాబు ప్రశంసిస్తూ ఆయన ఫొటో పోస్ట్ చేశారు. విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణల వద్ద మాస్కులు ఉన్నప్పటికీ వినియోగించట్లేదని తెలుపుతూ వారి ఫొటోలను పోస్ట్ చేశారు. ప్రజల మధ్య మాస్కులు వాడడం మన ధర్మమని ఆయన హితవు పలికారు. 
nagababu
Janasena
COVID-19

More Telugu News