Kishan Reddy: అర్నబ్ గోస్వామిపై జరిగిన దాడిపై స్పందించిన కేంద్ర హోమ్ శాఖ

Home Ministry Orders Immediate Action on Attack on Arnab
  • గత రాత్రి అర్నబ్, ఆయన భార్యపై దాడి
  • తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి
  • తక్షణ చర్యలకు తీసుకోమని చెప్పిన హోమ్ శాఖ
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి, ఆయన భార్య సంయబ్రతా గోస్వామి గత రాత్రి కారులో ప్రయాణిస్తున్న వేళ జరిగిన దాడిపై కేంద్ర హోమ్ శాఖ స్పందించింది. దాడి కారకులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కోరినట్టు హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "ఎడిటర్ అర్నబ్ గోస్వామి, ఆయన భార్యపై గత రాత్రి జరగిన దాడి ప్రజాస్వామ్యంలో నాలుగో మూలస్తంభమైన జర్నలిస్టులందరిపై జరిగిన దాడే. ఇది వాక్ స్వాతంత్ర్యం, భావ స్వాతంత్ర్యంపై జరిగిన దాడిగా భావిస్తూ ఖండిస్తున్నాను. తక్షణ చర్యలు చేపట్టాలని ముంబై పోలీసులను కోరుతున్నాను" అని ఈ ఉదయం 10.30 గంటల సమయంలో కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
Kishan Reddy
Arnab Goswamy
Attack
Mumbai Police

More Telugu News