Corona Virus: కరోనా సంక్షోభంలో మోదీ ప్రభుత్వం పని తీరు బాగుంది: సర్వేలో 93.5 శాతం ప్రజల విశ్వాసం

  • ప్రభుత్వ పని తీరుపై ఐఏఎన్‌ఎస్- సీ-ఓటర్ సర్వే
  • గురువారం విడుదలైన ఫలితాలు
  • ప్రభుత్వంపై క్రమంగా పెరిగిన నమ్మకం
Over 93 percent people trust Modi govt will handle Covid19 crisis well says Survey

దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని  ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ రోజు విడుదలైన ఓ సర్వేలో 93.5 శాతం మంది ప్రజలు మోదీపై విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 25వ తేదీన 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రం.. తర్వాత దాన్ని మే 3వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

ఐఏఎన్‌ఎస్- సి- ఓటర్ కొవిడ్ 19 ట్రాకర్ సర్వే ప్రకారం.. లాక్‌డౌన్‌ మొదలైన తొలి రోజు మోదీ ప్రభుత్వంపై 76.8 శాతం ప్రజలు నమ్మకం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 21 నాటికి అది 93.5 శాతానికి పెరిగింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 21 వరకు నిర్వహించిన ఈ సర్వేలో.. ‘కరోనా వైరస్‌ను భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కుంటోందని నేను భావిస్తున్నా’ అన్న స్టేట్‌మెంట్‌ను ప్రజల ముందుంచి వారి నుంచి సమాధానాలు రాబట్టారు. ఏప్రిల్ 16వ తేదీన 75.8 శాతం ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. కానీ, దేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వానికి మద్దతిచ్చే వారి శాతం ఒక్కసారిగా పెరిగింది.

More Telugu News