SMEs: రూ. 2.32 లక్షల కోట్ల రుణ మొత్తం డిఫాల్ట్: సిబిల్ హెచ్చరిక

  • చిన్న, మధ్యతరహా కంపెనీలపై కరోనా ప్రభావం
  • ఇప్పటికిప్పుడు రుణాల చెల్లింపు కష్టమన్న సిబిల్
  • ఆరు నెలల మారటోరియాన్ని కోరిన ఐబీఏ
CIBIL Warns About Defaulters During Corona Pandamic

కరోనా మహమ్మారి కారణంగా బ్యాంకులు గతంలో ఇచ్చిన రుణాల్లో రూ. 2.32 లక్షల కోట్ల మొత్తం డిఫాల్ట్ అయ్యే ప్రమాదం పొంచివుందని సిబిల్ హెచ్చరించింది. ముఖ్యంగా రూ. 10 లక్షల లోపు రుణాలు తీసుకున్న చిన్న చిన్న వ్యాపార సంస్థలు, పరిశ్రమలు కరోనా ప్రభావాన్ని అధికంగా చవి చూస్తున్నాయని, ఇవేమీ తాము తీసుకున్న రుణాలను ఇప్పట్లో తిరిగి చెల్లించే పరిస్థితి లేదని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ అంచనా వేసింది. బ్యాంకులు రూ. 10 లక్షల లోపు రుణాలుగా ఇచ్చిన మొత్తం రూ. 93 వేల కోట్ల వరకూ ఉండగా, అందులో రూ. 13 వేల కోట్లకు పైగా మొండి బకాయిల ఖాతాల్లోకి వెళ్లనున్నాయని అభిప్రాయపడింది.

ఇదే సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరింది. రుణ బకాయిలపై ఆరు నెలల మారటోరియం విధించాలని సూచించింది. దీంతో పాటుగా క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ను ప్రవేశపెట్టాలని, వన్‌టైమ్ రుణ పునర్వ్యస్థీకరణ పధకాన్ని కూడా అందుబాటులో ఉంచాలని సిఫార్సు చేసింది.

More Telugu News