Telangana: బయట ఎందుకలా తిరుగుతున్నావన్న భార్య.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య

Husband suicide after wife asked not to go outside
  • సిద్ధిపేట జిల్లా లింగారెడ్డిపల్లి గ్రామంలో ఘటన 
  • భార్య ప్రశ్నించడంతో మనస్తాపం
  • మామిడి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న వైనం
కరోనా వైరస్ భయపెడుతున్న నేపథ్యంలో బయట తిరగొద్దని భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో జరిగిందీ ఘటన.

 పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంద రాములు (60) గజ్వేల్‌లో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా దుకాణం మూతబడడంతో స్వగ్రామం లింగారెడ్డిపల్లికి చేరుకున్న రాములు.. ఇంటి పట్టున ఉండకుండా తిరుగుతూనే ఉన్నాడు. మంగళవారం గజ్వేల్ వెళ్లొచ్చాడు. దీంతో ఆయన భార్య అంజమ్మ కోప్పడింది. బయట పరిస్థితులు బాగాలేవని, అలా ఊరికే బయట తిరగొద్దని మందలించింది.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. భార్య ప్రశ్నించడంతో మనస్తాపానికి గురైన రాములు నిన్న ఇంటి సమీపంలోని మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
Siddipet District
Lockdown
Suicide

More Telugu News