Ram: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Hebba patel to play guest role in Red
  • మళ్లీ గెస్ట్ రోల్ చేస్తున్న ముద్దుగుమ్మ 
  • ఎన్టీఆర్ ఛాలెంజ్ కి వెంకీ రిప్లై
  • మరో చిత్రానికి ఓకే చెప్పిన విశాల్
 *  ఇటీవల 'భీష్మ' సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన హెబ్బా పటేల్ తాజాగా మరో సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో నటిస్తోంది. రామ్ హీరోగా రూపొందుతున్న 'రెడ్' లో ఈ చిన్నది ఓ స్పెషల్ సాంగుతో పాటు కొన్ని సన్నివేశాలలో కూడా కనిపిస్తుందట.
*  ఎన్టీఆర్ విసిరిన 'బి ద రియల్ మేన్' ఛాలెంజ్ ని వెంకటేశ్ తనదైన శైలిలో స్వీకరించాడు. 'ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశా.. మన గ్యాంగ్ లీడర్ (చిరంజీవి) వీడియో కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ వెంకీ తాజాగా ట్వీట్ చేశారు. అన్నట్టు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లకు ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్ ని విసిరిన సంగతి విదితమే.
*  తమిళ హీరో విశాల్ తన తదుపరి చిత్రాన్ని కార్తీక్ తంగవేలు దర్శకత్వంలో చేయడానికి ఓకే చెప్పాడు. ఆమధ్య వచ్చిన 'అడంగమారు' చిత్రం ద్వారా దర్శకుడిగా కార్తీక్ తమిళంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు విశాల్ తో చేసే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాడు.  
Ram
Hebbapatel
Junior NTR
Venkatesh
Chiranjeevi
Vishal

More Telugu News