Donald Trump: అమెరికాలో ఇక వాణిజ్య కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి: ట్రంప్ ట్వీట్

Trump Says US States are becoming Safe
  • రాష్ట్రాలు సురక్షితం అవుతున్నాయి 
  • వయో వృద్ధులపై మరింత దృష్టి
  • తనను మాత్రం మినహాయించాలన్న ట్రంప్
అమెరికా కరోనా మహమ్మారి బారి నుంచి సురక్షితమవుతోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "దేశం సురక్షితం అవుతోంది. దేశంలో వాణిజ్య కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. మనకెంతో ప్రియతములైన వయో వృద్ధులపై మరింత దృష్టిని, ప్రత్యేక శ్రద్ధను అన్నివేళలా అందిస్తాం (నన్ను మాత్రం మినహాయించి) వారందరి జీవితాలనూ మరింత మెరుగ్గా చేస్తాము. మీ అందరికీ ప్రేమతో..." అని ట్వీట్ చేశారు.
Donald Trump
Twitter
Safe

More Telugu News