Nagababu: అన్నయ్య సినిమాల్లో ఆ రెండూ వరుణ్ బాడీ లాంగ్వేజ్ కి బాగుంటాయి: నాగబాబు

Nagababu about remakes of Chiranivi films
  • నాకు 'ఛాలెంజ్' సినిమా అంటే ఇష్టం
  • 'కొదమ సింహం' కూడా బాగా నచ్చుతుంది
  • అన్నయ్య సినిమాలను రీమేక్ చేయడం కష్టమన్న నాగబాబు
తాజాగా నాగబాబుతో యాంకర్ రవి లైవ్ చాట్ చేస్తూ, కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను అడిగాడు. 'చిరంజీవిగారు చేసిన సినిమాల్లో ఏదైనా ఒక సినిమాను వరుణ్ తేజ్ తో రీమేక్ చేయవలసి వస్తే ఏ సినిమా చేస్తారు?' అని రవి అడిగాడు. అందుకు నాగబాబు స్పందిస్తూ .. 'అన్నయ్య చేసిన సినిమాల్లో నాకు 'ఛాలెంజ్' అంటే చాలా ఇష్టం. సత్యానంద్ గారు మంచి స్క్రీన్ ప్లేను అందించారు. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి ఈ సినిమా అయితే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది.

'అలాగే అన్నయ్య సినిమాల్లో 'కొదమ సింహం' కూడా నాకు బాగా నచ్చుతుంది. హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రూపొందించిన సినిమా అది. ఈ సినిమా కూడా వరుణ్ తేజ్ కు సెట్ అవుతుందని అనుకుంటూ వుంటాను. కానీ అన్నయ్య చేసిన సినిమాలను రీమేక్ చేసి మెప్పించడం అంత తేలికైన విషయమేం కాదు .. అది కత్తి మీద సాములాంటిదే' అంటూ తన మనసులోని మాట చెప్పారు.
Nagababu
Anchor Ravi
Varun Tej

More Telugu News