జూమ్ యాప్ వాడిన ఇద్దరి డేటాను దొంగిలించిన హ్యాకర్లు
- కోల్‌కతాకు చెందిన ఫ్రొఫెషనల్స్ నుంచి డబ్బు డిమాండ్
- బిట్ కాయిన్ల రూపంలో ఇవ్వాలని మెయిల్ చేస్తున్న నేరగాళ్లు
- జూమ్ యాప్ భద్రం కాదని కొన్ని రోజుల క్రితమే చెప్పిన కేంద్రం
ఆ ఇద్దరి కంప్యూటర్ల నుంచి డేటా దొంగిలించారు. అది తిరిగి ఇవ్వాలంటే బిట్ కాయిన్స్ రూపంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ మెయిల్స్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. తమ డిమాండ్లకు ఒప్పుకోకపోతే తస్కరించిన డేటాను పూర్తిగా తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని తెలిపారు. బాధితుల ఫిర్యాదు ప్రకారం.. హ్యాకర్లు వెయ్యి అమెరికా డాటర్ల బిట్ కాయిన్స్ కావాలని ఆడిగారు. ఈ కేసును సైబర్ క్రైమ్ విభాగంతో పాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా విచారిస్తోంది.