Dadisetty Raja: టీడీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి: ఏపీ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా

AP Government VIP Dadisetti comments on TDP
  • ‘కరోనా‘ కట్టడి విషయంలో సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేస్తోంది
  • అలాంటి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తారా?
  • సంస్కారం లేని చంద్రబాబు... కన్నాకు మంచి మిత్రుడయ్యాడు
ఏపీలో ‘కరోనా‘ కట్టడి విషయంలో ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్న తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా, టీడీపీ నేతలు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు.

ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు సబబుగా లేదని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దగ్గర చందాలు తీసుకున్న కన్నా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం లేని చంద్రబాబు... కన్నాకు మంచి మిత్రుడు అయ్యాడంటూ ధ్వజమెత్తారు.
Dadisetty Raja
Andhra Pradesh
Government
VIP
Chandrababu

More Telugu News