హీరోపై పగ తీర్చుకునే పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ 

  • గోపీచంద్ మలినేని నుంచి 'క్రాక్'
  • మెయిన్ విలన్ రోల్ చేస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్
  • విలన్ రోల్స్ ద్వారా ఆమెకి మంచి క్రేజ్  
Krack Movie

తెలుగు .. తమిళ భాషల్లో లేడీ విలన్ పాత్రల ప్రస్తావన రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు .. విలన్ రోల్స్ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' సినిమాలో ఆమె చేసిన విలన్ రోల్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ప్రస్తుతం ఆమె రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న 'క్రాక్' సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో తనే మెయిన్ విలన్ అనేది తాజా సమాచారం. తన భర్తను అంతం చేసిన హీరోపై పగ తీర్చుకునే విలన్ పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు. అందుకు సంబంధించిన సన్నివేశాల్లో ఆమె నటన, ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కి తప్పకుండా ఈ సినిమా తెలుగులో బ్రేక్ ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News