Corona Virus: ముద్దు చేసిన నర్స్ నుంచి చిన్నారికి సోకిన కరోనా!

  • కరోనా లక్షణాలున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్స్
  • క్వారంటైన్ కి బాలుడి తల్లిదండ్రులతో పాటు ఇంట్లో అందరూ 
  • ఐసొలేషన్ వార్డుల్లోని చిన్నారులను సముదాయించలేకపోతున్న సిబ్బంది
Child Infected from Nurse in Hyderabad

ఈ కరోనా కష్టకాలంలో అన్నీ తెలిసిన పెద్దల నిర్లక్ష్యపు వైఖరి కూడా చిన్నారులను ఇబ్బందుల పాలు చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. హైదరాబాద్ లోని నిమ్స్ లో పనిచేస్తున్న ఓ నర్స్ తన ఇంట్లోని బాలుడిని ముద్దు చేయడంతో ఆమె నుంచి బాలునికి వ్యాధి సోకింది. సదరు నర్స్ కు కరోనా లక్షణాలు ఉన్నా, ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. దీంతో బాలుని తల్లిదండ్రులతో పాటు ఆ ఇంట్లోని వారందరినీ అధికారులు క్వారంటైన్ చేశారు.

కాగా, ఇప్పటికే తల్లిదండ్రుల నిర్లక్ష్యం, తెలిసీ తెలియని తనంతో చాలా మంది చిన్నారులు వ్యాధి బారిన పడ్డారని అధికారులు అంటున్నారు. 14 సంవత్సరాల లోపు ఉన్న వారిలో 75 మంది, 14 నుంచి 16 ఏళ్ల లోపున్న మరో 70 మంది కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. వీరిలో చాలామందికి మర్కజ్ కాంటాక్ట్ లేకున్నా వైరస్ సోకడం గమనార్హం.

ఇదిలావుండగా, ఇంకో కలవర పెడుతున్న విషయం ఏంటంటే, కరోనా సోకి, ఐసొలేషన్ వార్డుల్లో ఒంటరిగా ఉంటున్న చిన్నారులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. తమకు అమ్మా, నాన్నలు కావాలని వారు మారాం చేస్తుంటే వైద్య సిబ్బంది వారినెలా సముదాయించాలో తెలియని పరిస్థితిలో పడిపోతున్నారు.

More Telugu News