Supreme Court: వలస కార్మికుల అంశాన్ని కేంద్రం నిర్ణయానికే వదిలేసిన సుప్రీంకోర్టు

  • వలస కార్మికులను ఆదుకోవాలంటూ సుప్రీంను ఆశ్రయించిన సామాజికవేత్తలు
  • రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలంటే తాము కేంద్రాన్ని ఆదేశించలేమన్న సుప్రీం
  • ఇలాంటి వ్యవహారాల్లో తాము నిపుణులం కాదంటూ స్పష్టీకరణ
Supreme Court tells can not order Centre to pay migrant workers

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని, లాక్ డౌన్ కాలంలో వలస కార్మికులకు కనీస దినసరి భత్యం చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వలస కార్మికులను కేంద్రం ఆదుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ స్వామి అగ్నివేశ్, హర్ష్ మందర్ వంటి సామాజిక కార్యకర్తలు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం, రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని న్యాయస్థానాలు ఎలా ఆదేశిస్తాయో అర్థం కావడంలేదని పేర్కొంది.

"మేమేమన్నా ఇలాంటి వ్యవహారాల్లో ఆరితేరిన వాళ్లమా? అక్కడ రాష్ట్రాలలోను, కేంద్రంలోనూ పాలించడానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉన్నాయి. నిధులు ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి... ఆర్థిక మద్దతు ఇవ్వండంటూ మేం ఎవరినీ ఆదేశించలేం" అంటూ జస్టిస్ ఎన్వీ రమణ, ఎస్కే కౌల్, బీఆర్ గవాయ్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

More Telugu News