Kanna Lakshminarayana: కాణిపాకంలో ప్రమాణం చేస్తానన్న నా మాటకు కట్టుబడి ఉన్నా: కన్నా లక్ష్మీనారాయణ

Kanna lLakshmi Narayana criticises MP Vijayasaireddy
  • విజయసాయి కూడా కట్టుబడి ఉంటాడని అనుకుంటున్నా
  • లాక్ డౌన్ ముగిశాక ఓ తేదీ నిర్ణయిస్తా 
  • అచ్చోసిన ఆంబోతులా విజయసాయిరెడ్డి తిరుగుతున్నాడు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దగ్గర తాను రూ.20 కోట్లు తీసుకుని ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నానంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోమారు ఖండించారు.

గుంటూరులో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాణిపాకం వినాయకస్వామి గుడిలో ప్రమాణం చేస్తానన్న మాటకు తాను కట్టుబడి ఉన్నానని, విజయసాయిరెడ్డి కూడా కట్టుబడి ఉంటాడని అనుకుంటున్నానని అన్నారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం ఓ తేదీ నిర్ణయిస్తానని, ఆ రోజున గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

తన తండ్రి చనిపోయినా కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఢిల్లీ వెళ్లలేదని, లాక్ డౌన్ సమయంలో ‘అచ్చోసిన ఆంబోతులా’ విజయసాయిరెడ్డి తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News