Eetala Rajender: కేటీఆర్ ప్రశంసలపై ఈటల రాజేందర్ స్పందన!

Minister Eetala Rajender thanks to CM Kcr and Ktr
  • స్పోర్ట్స్ టవర్ ను టిమ్స్ గా మార్చారు
  • తక్కువ  రోజుల్లో ఈ ఘనత సాధించారు: కేటీఆర్ ప్రశంసలు
  •  సీఎం కేసీఆర్ ప్రోత్సాహం, గైడ్ లైన్స్ వల్లే అది సాధ్యమైంది: ఈటల
హైదరాబాద్, గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్ ను 20 రోజుల లోపే తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)గా మార్చినందుకు రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. చాలా తక్కువ సమయంలోనే దీనిని 1500 పడకల ఆసుపత్రిగా మార్చారని, రాజేందర్, ఆయన బృందం కలిసి అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జతపరిచారు.

కేటిఆర్ ప్రశంసలపై ఈటల రాజేందర్ స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహం, గైడ్ లైన్స్ వల్లనే ఆ పని పూర్తి చేశామని, అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అదే విధంగా కేటీఆర్ కూ, ఆరోగ్య శాఖ బృందానికి కృతఙ్ఞతలు తెలిపారు.
Eetala Rajender
TRS
ktr
kcr
Corona Virus
sports tower
TIIMS

More Telugu News