n95: రూ. 45కే ఎన్‌95ను పోలిన స్వదేశీ మాస్కు

  • ‘కవచ్’ పేరుతో రూపొందించిన ఢిల్లీ ఐఐటీ స్టార్టప్
  • ఎన్‌95లో ఉండే ప్రమాణాలు కవచ్‌లో కూడా
  • ఉతికి పదిసార్లు వాడుకునే సౌలభ్యం
 IIT Delhi startup unveils indigenous N95 similar mask at Rs 45

కరోనా నేపథ్యంలో దేశంలోని శాస్త్రవేత్తలు, నిపుణులు అనేక కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, తక్కువ ఖర్చుతో ఐసీయూ వెంటిలేటర్ల నుంచి కరోనా టెస్టింగ్ కిట్ల వరకూ తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో వైరస్ నుంచి రక్షణ కోసం ఉపయోగించే ఎన్‌95 మాస్కును పోలిన స్వదేశీ ఫేస్‌మాస్కును ఢిల్లీ ఐఐటీకి చెందిన ఓ స్టార్టప్ సంస్థ రూపొంచింది. దీనికి ‘కవచ్’ అనే పేరు పెట్టింది.  

ప్రస్తుతం ఎన్‌95 మాస్కులు ఎక్కువగా అందుబాటులో లేవు. వాటి ధర కూడా అధికమే. 98 శాతం స్వచ్ఛమైన ఈ మాస్కును ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో, ఎన్‌95లో ఉండే అన్ని ప్రమాణాలతో సదరు స్టార్టప్ కంపెనీ ‘కవచ్’ మాస్కును రూపొందించింది.  ఇది కూడా మెరుగైన రక్షణ కల్పిస్తుందని చెప్పింది. దీని ధర కేవలం రూ. 45 మాత్రమే. ఈ మాస్కును కనీసం పదిసార్లు ఉతికి వాడుకోవచ్చని తెలిపింది.

More Telugu News