Pattabhi: వైసీపీ నేతలు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు: టీడీపీ నేత పట్టాభి

YSRCP leades spreading corona virus says TDP leader Pattabhi
  • పేదలకు చేస్తున్న సాయంలో కూడా ఆర్భాటానికి పోతున్నారు
  • లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు
  • టెస్టింగ్ కిట్ల కోనుగోలు పేరుతో దోచుకుంటున్నారు
ప్రజలంతా లాక్ డౌన్ ను పాటిస్తున్న వేళ... వైసీపీ నేతలు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పలువురు వైసీపీ నేతలు... పెద్ద ఎత్తున కార్యకర్తలను వెనకేసుకెళ్లి... పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు.

పేదలకు చేస్తున్న సాయంలో కూడా వైసీపీ నేతలు ఆర్భాటానికి పోతున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో కరోనా మూడో దశకు చేరుకుందని... ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపించారు. ఓవైపు కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని... మరోవైపు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని పట్టాభి మండిపడ్డారు.
Pattabhi
Telugudesam
YSRCP
Lockdown
Testing Kits

More Telugu News