Roja: లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ రోజాపై విమర్శల వెల్లువ!

YSRCP MLA Roja violates lockdown rules
  • బోరుబావి ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజా
  • పూలు చల్లుతూ సందడి చేసిన వైసీపీ కార్యకర్తలు
  • రోజా తీరుపై మండిపడుతున్న విపక్షాలు
చిత్తూరు జిల్లా వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఆమె వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పలువురు మండిపడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే, పుత్తూరు సుందరయ్యనగర్ లో బోరుబావి ప్రారంభోత్సవానికి  రోజా వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడి జనం ఆమెపై పూలు చల్లుతుండగా, ఆమె ముందుకు కదిలారు. ఆమెతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ అభిమానులు కలిసి వెళ్లారు.

దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై విపక్ష నేతలు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని దుయ్యబడుతున్నారు. రోజా తీరుతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శించారు.
Roja
YSRCP
Lockdown
Violation

More Telugu News