Wines: మద్యం దుకాణాలు తెరుస్తున్నాం: కీలక ప్రకటన చేసిన మహారాష్ట్ర

  • ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటన
  • రెడ్ జోన్ లేని ప్రాంతాల్లో అమ్మకాలకు అనుమతి
  • వెల్లడించిన మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే
Maharashtra Will Repoen Liquor Shops with Conditions

లాక్‌ డౌన్ కార‌ణంగా గడచిన 30 రోజులుగా మ‌ద్యం దొర్క‌క విలవిల్లాడుతున్న మందుబాబులకు మహారాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. రెడ్ జోన్ కాని ప్రాంతాల్లో దుకాణాలు తెరచుకునేందుకు షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేయనున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తినిస్తూ ఒకటి లేదా రెండు రోజుల్లో నోటిఫికేష‌న్‌ ను వెలువరిస్తామని అయితే, ప్రభుత్వం విధించే ప్రత్యేకమైన గైడ్‌ లైన్స్‌ ఆధారంగా అమ్మకాలకు అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

లిక్కర్ షాపుల వద్ద సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరని, రూల్స్ అన్నీ పాటిస్తేనే పర్మిషన్ ఉంటుందని, నిబంధనలను మీరినట్టు తేలితే, వెంటనే దుకాణం లైసెన్స్ ను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా, ఇప్పటికే మేఘాలయ, అసోం,  ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు అనుమతించాయి. ఢిల్లీ సర్కారు సైతం మద్యం షాపులు తెరిచే ఆలోచన చేస్తోంది. తెలంగాణలోనూ వైన్స్ షాపులు తెరవాలన్న డిమాండ్ వస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాలు అనుసరించే విధానాన్ని పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

More Telugu News