జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అనే వార్త కలచివేసింది: మాజీ ఎంపీ కవిత
- ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్
- అందరూ క్వారంటైన్ కు తరలింపు
- మీడియా మిత్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్న కవిత
'ముంబై జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అనే వార్త కలచివేసింది. ఇది చాలా దురదృష్టకరం. కరోనా మహమ్మారిపై అందరం యుద్ధం చేస్తున్న ఈ తరుణంలో... మీడియా మిత్రులందరూ వారి గురించి, వారి కుటుంబాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి' అని కవిత సూచించారు.