Lockdown: అక్రమంగా మద్యం అమ్ముతున్న తమిళ సహాయ నటుడి అరెస్ట్!

Police Arrest Tamil Acter for Illicit Sales of Liquor
  • లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలు బంద్
  • తన ఇంట్లోనే అక్రమంగా విక్రయిస్తున్న రిస్కాన్
  • పక్కా సమాచారంతో పోలీసుల దాడులు
ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో, ఒక్కో క్వార్టర్ మద్యాన్ని రూ. 1,200కు అమ్ముతున్న తమిళ సినీ సహాయ నటుడిని, ఆయన స్నేహితులను పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయడంతో, మందుబాబులను దోచుకునేందుకు ఎన్నో ముఠాలు బయలుదేరాయి.

ఈ క్రమంలో చెన్నైలోని ఎంజీఆర్ నగర్ పరిధిలోని అన్నా మెయిన్ రోడ్డులో ఓ ఇంట మద్యం విక్రయాలు సాగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు మెరుపుదాడి చేశారు. అక్కడ కోలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్న రిస్కాన్ (30) అనే యువకుడిని అరెస్ట్ చేశారు. తన మిత్రుల నుంచి రూ. 1000కి క్వార్టర్ కొని, తాను రూ. 1,200కు అమ్ముతున్నానని పోలీసుల విచారణలో రిస్కాన్ వెల్లడించాడు. రిస్కాన్ ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Lockdown
Wines
Liquor
Tamil Acter
Arrest

More Telugu News