Salman Khan: 'ప్యార్ కరోనా' అంటూ పాట పాడిన సల్మాన్... వీడియో ఇదిగో!

Salman Khan reveals his singing ability
  • ఫార్మ్ హౌస్ లో ఉంటున్న సల్మాన్ ఖాన్
  • తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సూపర్ స్టార్
  • స్వయంగా రచించి, పాట రికార్డు చేసిన సల్మాన్
లాక్ డౌన్ కారణంగా తన ఫార్మ్ హౌస్ కే పరిమితమైన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. కరోనా వైరస్ పై స్వయంగా రచించిన గీతాన్ని అద్భుతంగా గానం చేశారు. సెమీ లైట్ మ్యూజిక్ తో పాటు ర్యాప్ ను కూడా మిక్స్ చేసి ప్యార్ కరోనా అనే సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ గీత రచనలో సల్మాన్ తో పాటు హుస్సేన్ దలాల్ కూడా పాలుపంచుకున్నారు. సాజిద్-వాజిద్ ద్వయం సంగీతం సమకూర్చింది.

ఈ పాటను పన్వేల్ సమీపంలో ఉన్న సల్మాన్ ఫార్మ్ హౌస్ లోనే చిత్రీకరించారు. కాగా, ఈ పాటను అత్యంత నాణ్యతతో రికార్డు చేయడం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్టు పాటను వింటే అర్థమవుతుంది. ఈ పాటను సల్మాన్ తన యూట్యూబ్ చానల్లో రిలీజ్ చేశారు.
Salman Khan
Pyar Karona
Corona Virus
Lockdown

More Telugu News