Chiranjeevi: యంగ్ డైరెక్టర్స్ తో చేస్తే నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు: చిరంజీవి

Hero Chiranjeevi wants to act Young directors movies
  • చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆచార్య’
  • ఈ చిత్రం పూర్తయ్యాక  కొత్త ప్రాజెక్టు గురించి చెబుతా
  • యంగ్ జనరేషన్ కు నన్ను కొత్తగా ప్రజెంట్ చేయాలన్న తపన ఉంటుంది
ప్రముఖ హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించబోయే చిత్రాలన్నీ యువ దర్శకులతోనే ఉంటాయంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి స్పందించారు.

'సాహో' సుజిత్ తో 'లూసిఫర్' చేసే ఆలోచన వుంది. బాబీ, మెహర్ రమేశ్ లతో ఒక్కో సినిమా చేయాలనుకుంటున్నాను. హరీశ్ శంకర్, సుకుమార్, పరశురామ్ లను తన ఇంట్లోనే ఇటీవల కలిశాను. చర్చలు కూడా జరిగాయి' అని చెప్పారు. కొరటాల చిత్రం పూర్తయిన తర్వాత తన కొత్త ప్రాజెక్టు గురించి చెబుతానని చిరంజీవి అన్నారు.

యువ దర్శకులతో పని చేస్తే తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చని అన్నారు. ‘నన్ను స్క్రీన్ మీద చూస్తూ పెరిగి  డైరెక్టర్స్ అయిన యంగ్ జనరేషన్ కు నన్ను కొత్తగా ప్రజెంట్ చేయాలన్న తపన ఉంటుంది’ అని అన్నారు. అలాగే, తనకు కూడా వాళ్లతో, వాళ్ల కొత్త ఆలోచనలతో పని చేయడం ‘ఇన్స్పైరింగ్ ’ గా ఉంటుందని చిరంజీవి చెప్పారు.
Chiranjeevi
Tollywood
Aacharya
Next project
young directors

More Telugu News