kala venkatrao: రైతు సమస్యలపై.. సీఎం జగన్ కు టీడీపీ నేత కళా వెంకట్రావు లేఖ

TDP Leader Kala VenkatRao writes a letter to CM Jagan
  • పంట ఉత్పత్తులు అమ్ముకోలేక రైతు అవస్థలు
  • రైతును ఆదుకుంటామన్నది ప్రకటనలకే  పరిమితమా?
  • వ్యవసాయ ఉత్పత్తులను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి
ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత కళా వెంకట్రావు లేఖ రాశారు. పంట ఉత్పత్తులు అమ్ముకోలేక రైతులు అవస్థలు పడుతున్నారని, రైతును ఆదుకుంటామన్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆ లేఖలో విమర్శించారు. నెల దాటుతున్నా రైతులను ఆదుకునే చర్యలు చేపట్టడం లేదని అన్నారు.

పంట ఉత్పత్తుల రవాణాను పోలీసులు ఇంకా అడ్డుకుంటున్నారని, పంటను దళారులు తక్కువ ధరకే కొంటుంటే ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఎగుమతులు, మార్కెటింగ్ సౌకర్యాలు లేక ధరలు సగానికి పైగా తగ్గిన విషయాన్ని జగన్ దృష్టికి తెచ్చారు. ఖరీఫ్ కొనుగోళ్లే ఇంకా పూర్తి కాలేదని, ఇప్పుడు రబీ పంట కోతకు వచ్చిందని అన్నారు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం వద్ద కార్యాచరణ లేదని ఘాటుగా విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ఆ లేఖలో కోరారు.
kala venkatrao
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News