Chandrababu: పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

TDP Leader chandrababunaidu conducts Video conference with senior leaders
  • చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
  •  సరకుల పంపిణీలో అధికారులతో సమన్వయం చేసుకోవాలి
  • ఇలాంటి సమయాల్లో అన్న క్యాంటీన్లు, ఆర్టీజీఎస్ ఉంటే  ఉపయోగపడేవి 
పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు సీనియర్ నేతలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి చంద్రబాబుకు వివరించారు.

‘కరోనా’ నేపథ్యంలో సరకుల పంపిణీలో అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. గత పాలకులను ప్రజల్లో కించపర్చాలనే యోచన దుర్మార్గమైన చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. ఇలాంటి సమయాల్లో అన్న క్యాంటీన్లు, ఆర్టీజీఎస్ ఉంటే ఎంతో ఉపయోగపడేవని అభిప్రాయపడ్డారు.
Chandrababu
Telugudesam
Video conference

More Telugu News