అందుకు బాబుకు అమ్ముడుపోయిన కన్నా లాంటి వారే కారణం!: మరోసారి విజయసాయిరెడ్డి ఆరోపణలు

20-04-2020 Mon 12:01
  • దేశ వ్యాప్తంగా మోదీ గారి ఇమేజి పెరిగినా రాష్ట్రంలో బీజేపీ ఎదగలేదు
  • బాబు ప్యాకేజీ ఆఫర్ చాలా బాగుంటుంది
  • రాజకీయంగా అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది
  • బీజేపీలో ఉన్న వారు కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి
vijaya sai reddy fires on kanna

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేశారని, తనను ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విజయ సాయిరెడ్డి మరోసారి ఇలా మాట్లాడితే మర్యాద ఉండదని, ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు.

అయితే, కన్నా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి మరోసారి స్పందించి తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. 'దేశ వ్యాప్తంగా మోదీ గారి ఇమేజి పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ (బీజేపీ) ఎదగక పోవడానికి బాబుకు అమ్ముడు పోయిన కన్నాలాంటి వారే కారణం. బాబు ప్యాకేజీ ఆఫర్ ఎలాగుంటుందంటే రాజకీయంగా అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారు కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి' అని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్‌ ఖాతాలో విమర్శలు గుప్పించారు.