Lockdown: లాక్ డౌన్ ఆంక్షల సడలింపు నేపథ్యంలో.. ఏవి పని చేస్తాయి? ఏవి పని చేయవు?.. పూర్తి వివరాలు ఇవిగో!

What is not allowed in lockdown
  • నేటి నుంచి కొన్ని ప్రాంతాల్లో కొంత మేర లాక్ డౌన్ సడలింపు
  • అత్యవసర సేవలు, వస్తువులకు అనుమతి
  • ప్రైవేట్ కార్యకలాపాలపై కొనసాగుతున్న నిషేధం
కరోనా వైరస్ ప్రభావం అతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ కు ఈ రోజు నుంచి కొన్ని సడలింపులు ఇచ్చారు. వలస కార్మికులకు ఉపాధిని కల్పించేందుకు ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి. లాక్ డౌన్ సడలిస్తున్న ప్రాంతాల్లో ఏవి పని చేస్తాయి? ఏవి పని చేయవు? అనే విషయాలను తెలుసుకుందాం.

పని చేసేవి:
  • ఆర్బీఐ, బ్యాంకులు, సెబీ, ఇన్స్యూరెన్స్ కంపెనీలు.
  • సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి... జాతీయ గ్రామీణ ఉపాధి పనులు.
  • నీరు, శానిటేషన్, వేస్ట్ మేనేజ్ మెంట్, పవర్ రంగాలు.
  • సరుకుల లోడింగ్, అన్ లోడింగ్ పనులు (రాష్ట్ర, అంతర్రాష్ట్ర).
  • ఆన్ లైన్ టీచింగ్, డిస్టెన్స్ లెర్నింగ్.
  • ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్, కేబుల్ సర్వీసులు.
  • ప్రభుత్వ కార్యకలాపాల కోసం పని చేసే డేటా సెంటర్లు, కాల్ సెంటర్లు. మెడికల్, ఎమర్జెన్సీ  స్టాఫ్ కోసం హోటల్స్, లాడ్జిలు.
  • గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు. ఫుడ్ ప్రాసెసింగ్, ఔషధాలు, మెడికల్ ఎక్విప్ మెంట్ కంపెనీలు.
  • గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులు.
  • కార్మికులు అదనంగా  అవసరం లేని, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణ పనులు (రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు).
  • మెడికల్, వెటర్నరీ కేర్ సామగ్రిని తీసుకెళ్లే ప్రైవేట్ వాహనాలు.
  • కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల కార్యాలయాలు.
  • బాలురు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల వసతి గృహాలు.

అనుమతించనివి:
రైలు, రోడ్డు, విమాన ప్రయాణాలు.
ఈకామర్స్ కంపెనీలు సరఫరా చేసే అత్యవసరం కాని వస్తువులు.
విద్యాలయాలు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్.  
పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు.
ఆతిథ్య రంగం.
సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్సులు.
రాజకీయ, సామాజిక కార్యకలాపాలు.
మతపరమైన కార్యక్రమాలు.
ఒక్క రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు వలస కార్మికులకు అనుమతి నిరాకరణ.
Lockdown
Allowed
Not Allowed

More Telugu News