ప్రేమకథనే చేయమని పరశురామ్ కి చెప్పిన మహేశ్ బాబు!

Parashuram Movie
  • కథ విషయంలో మహేశ్ చెప్పిన మార్పు
  • రొటీన్ కి భిన్నంగా ఉండాలన్న మహేశ్  
  •  ప్రేమకథపైనే పరశురామ్ కసరత్తు
మహేశ్ బాబు తన తదుపరి సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ముందుగా మహేశ్ బాబుకి పరశురామ్ దేశభక్తి ప్రధానమైన కథను వినిపించాడట. ఆ కథ నచ్చి చేద్దామని మహేశ్ చెప్పాడట. అయితే లాక్ డౌన్ కారణంగా కథ విషయంలో ఆలోచించుకునే అవకాశం లభించింది.

ఇంతకుముందు వరుసగా తను చేసిన నాలుగు సినిమాల్లోను ప్రేమకథ పాళ్లు తక్కువగా ఉండటాన్ని గమనించిన మహేశ్ బాబు, పరిణతిని సాధించిన ప్రేమకథను సిద్ధం చేయమని పరశురామ్ తో చెప్పాడట. 'గీత గోవిందం' తరహాలోనే ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గకూడదనీ, ఆ సినిమా మాదిరిగానే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా వుండాలని అన్నాడట. మహేశ్ బాబు సూచన మేరకు, ఆ తరహా కథపై పరశురామ్ కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. మొత్తానికి చాలా కాలం తరువాత మహేశ్ బాబు ప్రేమకథలో కనిపించనున్నాడన్న మాట.
Go Back to Shorts
Mahesh Babu
Parashuram
Tollywood

More Telugu News