Guntur District: సత్తెనపల్లిలో మెడికల్ షాప్ కు వెళుతున్న యువకుడిని దారుణంగా కొట్టిన పోలీసులు... మృతి!

Police Beten youth to Death in Sattenapalli
  • మహమ్మద్ గౌస్ అనే యువకుడిని కొట్టిన పోలీసులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత 
  • మృతుడికి వేరే ఆరోగ్య సమస్యలున్నాయన్న పోలీసులు
లాక్ డౌన్ సమయంలో పోలీసులు చేసిన ఓవరాక్షన్, ఓ యువకుడి ప్రాణాలు తీసింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి చెక్ పోస్ట్ మీదుగా మెడికల్ షాపునకు వెళుతున్న మహమ్మద్ గౌస్ అనే యువకుడిని నిలువరించిన పోలీసులు, ఎందుకు బయటకు వచ్చావంటూ కొట్టారు. పోలీసుల దెబ్బలకు తాళలేక అక్కడే గౌస్, కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌస్ మరణించడంతో, అతని మృతికి పోలీసులే కారణమంటూ, బంధువులు ఆందోళనకు దిగారు.

ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ, ఆ ప్రాంతంలో రెడ్ జోన్ అమలులో ఉన్నందున కంటైన్ మెంట్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉన్నామని స్పష్టం చేశారు. గౌస్ ను పోలీసులు ఆపిన సమయంలో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ ను చూపించలేదని తెలిపారు. అతనికి వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, జరిగిన ఘటనపై శాఖా పరమైన విచారణకు ఆదేశించామని, పోలీసుల తప్పుందని భావిస్తే, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 
Guntur District
Mohammad Ghouse
Police
Sattenapalli

More Telugu News