మసీదులో దాక్కున్న 10 మంది ఇండోనేషియన్లు.. జైలుకు తరలించిన పోలీసులు
- తబ్లిగీ జమాత్ సదస్సు తర్వాత ధన్‌బాద్‌కు
- గోవిందాపూర్ మసీదులో రహస్యంగా మకాం
- స్థానిక కోర్టు ఆదేశాలతో అరెస్ట్
ఢిల్లీ నిజాముద్దీన్‌లో గత నెలలో జరిగిన తబ్లిగీ జమాత్ సదస్సుకు వీరంతా హాజరయ్యారు. వీసా నిబంధనల ఉల్లంఘనతోపాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం- 2005 కింద ఇండోనేషియా వాసులను అరెస్ట్ చేసినట్టు ధన్‌బాద్ పోలీసు అధికారి సురేంద్రసింగ్ తెలిపారు. తబ్లిగీ జమాత్ సమావేశం ముగిసిన అనంతరం ధన్‌బాద్ చేరుకున్న వీరంతా గోవింద్‌పూర్ మసీదులో దాక్కున్నట్టు పేర్కొన్నారు.