DGCA: బుకింగ్స్ ఆపండి... ఎయిర్ లైన్స్ సంస్థల ఆశలపై నీళ్లు చల్లిన డీజీసీఏ!

DGCA directs airlines no bookings till further notices
  • మే 4 నుంచి విమానాలు నడిపేందుకు సంస్థల సన్నాహాలు
  • టికెట్ల బుకింగ్ కు తెరలేపిన ఎయిర్ లైన్స్ సంస్థలు
  • తాము మళ్లీ చెప్పేంతవరకు బుకింగ్స్ వద్దన్న డీజీసీఏ
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో దేశీయ రూట్లలో సర్వీసులు తిప్పుదామని భావించి టికెట్ల బుకింగ్ ప్రారంభించిన ఎయిర్ లైన్స్ సంస్థల ఆశలకు డీజీసీఏ కళ్లెం వేసింది. తాము మళ్లీ ప్రకటన చేసేంతవరకు టికెట్ల బుకింగ్ లు నిలిపివేయాలని ఆదేశించింది ఈ మేరకు డీజీసీఏ ఓ ప్రకటన చేసింది. మే 4 నుంచి విమాన ప్రయాణాలకు తాము ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని, ఎలాంటి అనుమతులు కూడా మంజూరు చేయలేదని స్పష్టం చేసింది. కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు ఎయిర్ లైన్స్ సంస్థలకు తగిన సమయం ఇస్తామని, ముందుగా సమాచారం అందజేస్తామని డీజీసీఏ వివరించింది.
DGCA
Airlines
Lockdown
Corona Virus
Bookings
India
Domestic

More Telugu News