కన్నా పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

19-04-2020 Sun 18:42
  • చంద్రబాబు మాదిరే కన్నా ఆరోపణలు చేస్తున్నారన్న విజయసాయి
  • ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు
  • విజయసాయిరెడ్డికి హితవు పలికిన రాష్ట్ర బీజేపీ
BJP Rebukes Ysrcp mp Vijayasaireddy statement

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ స్పందించింది. కన్నాపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొంది. కన్నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని విజయసాయిరెడ్డికి హితవు పలికింది. కాగా,చంద్రబాబు మాదిరే కన్నా కూడా ఆరోపణలు చేస్తున్నారని, ఆయన రూ.20 కోట్లకు అమ్ముడుపోయారంటూ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు.