Namratha: కుమార్తె సితారకు 'స్పైడర్'లోని 'సిసిలియా...' పాటతో మెమొరీ థెరపీ చేస్తున్న నమ్రత... వీడియో!

Namrata Memory Theraphy to Sitara
  • పాత పాటలను గుర్తు చేసిన నమ్రత
  • వాటిని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేసిన సితార
  • ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పెట్టిన నమ్రత
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ముద్దుల తనయ సితారకు, తల్లి నమ్రత ఇప్పుడు మెమొరీ థెరపీ చేస్తున్నారు. పాత పాటలు ఆమె మదిలో ఎంతవరకూ గుర్తున్నాయో పరీక్షిస్తూ, ఆ వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ అమలవుతున్న ఈ రోజుల్లో, దుమ్ము పట్టిపోయిన పాత సీడీలను బయటకు తీసిన నమ్రత, వాటిల్లోని పాటలను సితారకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు.

స్పైడర్ చిత్రంలోని సిసిలియా, షీ ఈజ్ మిస్ మిస్టీరియస్... పాటలను పాటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను నమ్రత ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకోగా, అవిప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక, ఈ వీడియోలో కారులో సితార వెళుతున్నట్టు కనిపిస్తుండగా, పక్కనే స్కూల్ బ్యాగ్ కూాడ కనిపిస్తోంది. ఇక ఆ పాటలను సితార గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియోలను మీరూ చూడవచ్చు.
Namratha
Sitara
Instagram
Songs

More Telugu News