Hyderabad: చిన్న నిర్లక్ష్యం...80 మందిలో కరోనా భయానికి కారణం!

  • వైరస్‌ సోకిన వృద్ధురాలికి సాధారణ వైద్యం
  • కనీసం బాధితురాలో కాదో పరీక్షించని వైనం
  • ఆమె చనిపోయాకగాని తెలియని నష్టం
medical staff carelessnes about corona sufferer

వైద్యుల చిన్నపాటి నిర్లక్ష్యం ఎనభై మందిలో కరోనా భయానికి  కారణమైంది. హైదరాబాద్‌ భవనీనగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెకు కరోనా వైరస్‌ సోకినట్టు వెల్లడైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వివరాల్లోకి వెళితే... సదరు వృద్ధురాలికి అనారోగ్యం చేయడంతో ఆమెను కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ వైద్యుని వద్దకు తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి వైద్యుని సూచన మేరకు అదే ప్రాంతంలో ఉన్న మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

అప్పటికే ఆ వృద్ధురాలికి వైరస్‌ సోకింది. కానీ దీన్ని గుర్తించని అక్కడి వైద్యులు, సిబ్బంది సాధారణ చికిత్స అందించారు. కానీ కొన్నిరోజుల తర్వాత ఆ వృద్ధురాలు చనిపోయింది. ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఇప్పుడు హడావుడి మొదలయ్యింది.

ఆమె కుటుంబసభ్యులతోపాటు ఆమె తిరిగిన ఆసుపత్రులు, చికిత్స చేసిన వైద్యులు, సిబ్బందితోపాటు, ఆమె నివాసిత ప్రాంతాల్లోనివారు, ఆమెను కలిసిన వారిలో ఆందోళన మొదలయ్యింది. దాదాపు 80 మందికి ఆమె ద్వారా వైరస్‌ సోకే అవకాశం ఉందని ప్రాథమికంగా నిర్థారించారు. ల్యాబ్ నుంచి నివేదిక వస్తే అసలు విషయం వెలుగుచూస్తుంది. చూశారా...చిన్న నిర్లక్ష్యం ఎంత కొంపముంచిందో.

More Telugu News