Mumbai: మహిళ ముఖంపై ఉమ్మిన వ్యక్తి.. అరదండాలు వేసిన పోలీసులు

The man who spit in the face of the woman arrested
  • ముంబైలో ఘటన
  • బైక్ ఆపి ఉమ్మి పరారైన యువకుడు
  • నిందితుడిని మహ్మద్ అమీర్‌గా గుర్తింపు
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఉమ్మిన వ్యక్తిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ముంబైలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మణిపూర్‌కు చెందిన మహిళ తన సోదరితో కలిసి ఈ నెల 6న కలినా మార్కెట్‌లో కూరగాయలు కొనేందుకు వెళ్లింది. అనంతరం నడుచుకుంటూ వస్తుండగా ఊహించని ఘటన జరిగింది.

బైక్ పై వచ్చిన 23 ఏళ్ల యువకుడు వారి ముందు ఆగి మహిళ ముఖంపై ఉమ్మేసి పరారయ్యాడు. షాక్ కు ‌గురైన మహిళ తేరుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సదరు నిందితుడిని నిన్న అరెస్ట్ చేశారు. అతడిని కుర్లాకు చెందిన మహ్మద్ అలియాస్ మహ్మద్ అమీర్‌గా గుర్తించారు.
Mumbai
spit
Corona Virus
Manipuri woman

More Telugu News