KTR: ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకుండా చూడండి: మంత్రి కేటీఆర్

KTR Had a interactive videoconference session with Telangana chapter of CII
  • సీఐఐ తెలంగాణతో వీడియో కాన్ఫరెన్స్
  • ఎమ్‌ఎస్‌ఎంఈ సెక్టార్ సమస్యలు, రాష్ట్ర పరిస్థితిపై చర్చించాం
  • ట్విట్టర్లో వెల్లడించిన మంత్రి
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు భారత పరిశ్రమల సమాఖ్య (సీసీఐ) తెలంగాణ చాప్టర్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కారణంగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల (ఎమ్‌ఎస్ఎమ్‌ఈ) సెక్టార్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, వ్యాపార కార్యక్రమాల పున:ప్రారంభంపై కూడా మాట్లాడారు. కరోనా నేపథ్యంలో తమ సంస్థల్లో పని చేస్తున్న వారిలో ఒక్కరిని కూడా ఉద్యోగం నుంచి తప్పించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. అలాగే, ఉద్యోగుల భద్రత కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సూచించినట్టు ట్వీట్ చేశారు.
KTR
video conference
cii
Telangana

More Telugu News