Chandrababu: తన ప్రత్యర్థి మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు

Chandrababu expresses grief over demise of Chandramouli
  • తుదిశ్వాస విడిచిన కుప్పం వైసీపీ ఇన్చార్జి చంద్రమౌళి
  • చంద్రబాబుపై రెండు సార్లు పోటీ చేసిన చరిత్ర
  • ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించిన చంద్రబాబు
కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి కె.చంద్రమౌళి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. చంద్రమౌళి మృతి పట్ల చంద్రబాబు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణవార్త ఆవేదనను కలిగించిందని చెప్పారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఐఏఎస్ అధికారిగా చంద్రమౌళి వివిధ శాఖలలో ఉత్తమ సేవలను అందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Chandrababu
Chandramouli
Kuppam
Telugudesam
YSRCP

More Telugu News