Corona Virus: కరోనా భయాలతో భర్తను ఇంట్లోకి రానివ్వని భార్య.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Wife refused her husband to enter in to home due to corona fears
  • నెల్లూరులో స్వర్ణకారుడిగా పని చేస్తున్న బాధితుడు
  • వెంకటగిరిలోని ఇంటికి వచ్చిన వైనం
  • కరోనా పరీక్షలు చేయించుకుంటేనే ఇంట్లోకి రానిస్తానన్న భార్య
కరోనా భయాలు చిత్రవిచిత్రమైన ఘటనలకు కారణమవుతున్నాయి. భర్తను భార్య ఇంట్లోకి రానివ్వని ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఓ వ్యక్తి నెల్లూరులో స్వర్ణకారుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం నాడు వెంకటగిరిలోని బంగారుపేటలో ఉన్న తన ఇంటికి వచ్చాడు.

అయితే, ఆయనను భార్య ఇంట్లోకి రానివ్వలేదు. కరోనా పరీక్షలు చేయించుకుంటే కానీ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వనని తెగేసి చెప్పింది. అంతేకాదు వాలంటీర్ కు కూడా ఫోన్ చేసింది. దీంతో వాలంటీర్ ఇచ్చిన సమాచారంతో... వైద్య సిబ్బంది, పోలీసులు వచ్చి ఆయనను క్వారంటైన్ కు తరలించారు.

ఆ తర్వాత ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. ఆ తర్వాత ఆయన తన ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా బాధితుడి భార్య మాట్లాడుతూ, తమ పిల్లలతో పాటు, చుట్టుపక్కల వారి ఆరోగ్యం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది.
Corona Virus
Wife
Husband
Venkatagiri

More Telugu News