America: లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్న అమెరికన్లు...‘స్టే ఎట్‌ హోం’కు వ్యతిరేకంగా నిరసనలు

anti lockdown agitations in america
  • ఆంక్షలు ఎత్తివేయాలని కాలిఫోర్నియా బీచ్‌లో ఆందోళన
  • స్టే ఎట్‌ హోం ఆదేశాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌
  • ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా అమెరికా ప్రజలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘స్టే ఎట్‌ హోం’, భౌతిక దూరం పాటించాలంటూ కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తక్షణం ఉపసంహరించాలంటూ అక్కడి వారు ఆందోళనకు దిగారు.

అంతకుముందు మిన్నెసోటా, మిచిగాన్, వర్జీనియా, నార్త్ కరోలినా, కెంటకి రాష్ట్రాల్లోనూ ఇటువంటి ఆందోళనలు మొదలయ్యాయి.  కాలిఫోర్నియాలో  వందలాది మంది ఆందోళనకారులు బీచ్‌కి చేరుకుని లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. వీరిలో కొందరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు దారులు కూడా ఉన్నారు.

ట్రంప్‌ కూడా మొదటి నుంచి ఇదే వైఖరితో ఉన్నారు. ఎంతవేగంగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే ఆర్థిక రంగం అంత వేగంగా కోలుకుంటుందన్నది ట్రంప్‌ ఉద్దేశం. అందుకే ఆయన లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు. అయితే మిన్నెసోటా, మిచిగాన్, వర్జీనియా, నార్త్ కరోలినా, కెంటకి రాష్ట్రాలన్నీ డెమొక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్ల పాలనలో ఉన్నాయి.

వీళ్లంతా ఆంక్షలు ఎత్తివేయాలన్న ట్రంప్ ఆలోచనలను మొదటి నుంచి తప్పుపడుతున్నారు. రాష్ట్రాల అధికారాల్లో తలదూర్చి ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం అధ్యక్షుడికి లేకపోవడంతో ట్రంప్ పరోక్షంగా ఇలాంటి ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
America
Lockdown
agitations

More Telugu News